రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్...

రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్...

నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్13( తెలంగాణ మేఘ టైమ్స్ ): తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 13న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో  తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకోవడంతో అధ్యక్షులువిజయ్ పాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, ద్యావర  నర్సారెడ్డి లను తెల్లవారుజామున మూడు గంటలకి ఫోర్త్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సంయుక్తంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మూడు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అందుకోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అనగా 13వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కొరకు వెళ్తుంటే తెల్లవారుజామున మూడు గంటలకి ఇంటి వద్ద వచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ అరెస్టుల వల్ల రెడ్డి ఐక్యవేదిక ఉద్యమాలను ఆపలేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జరిగే అసెంబ్లీ లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించాలని అన్నారు. లేకుంటేవచ్చే ఎన్నికల్లోతగిన గుణపాఠం చూపిస్తామని అన్నారు.అరెస్టు అయిన వారిలో  అధ్యక్షులు విజయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి,ద్యావర  నర్సారెడ్డి లను తదితరులు ఉన్నారు

Comments

Popular posts from this blog

జర్నలిస్టులకు బువ్వకుండ...

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి