ఇంటర్ ఫలితాల్లో ఎస్.ఆర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

                          అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులతో అధ్యాపక బృందం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఎస్.ఆర్  విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ఇన్చార్జి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ  బైపీసీ విభాగంలో ఇంటర్ మొదటి సంవత్సరం లో సాయి అమృత వర్షిని 437/ 440 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. అదేవిధంగా  436/ 440 మార్కులు సాధించిన విద్యార్థులు ఆరుగురు , 435/440 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారని రాష్ట్ర జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి విజయం  సాధించారని  అన్నారు.. ఎస్సార్ కళాశాలలు స్థాపించి నిజామాబాద్ లో 9 సంవత్సరాలు గడుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు మా యొక్క కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు అన్నారు. ఇవేకాకుండా జేఈఈ మెయిన్స్ లో కానీ, ఐఐటీలో కానీ, ఎంసెట్ లో కాని  ఇలాగే అద్భుత ఫలితాలను సాధిస్తుంది మా ఎస్ ఆర్ కళాశాల అని హర్షం వ్యక్తం చేశారు. మా కళాశాల అధ్యాపకుల  ఉత్తమమైన బోధనతోపాటు  వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం  తో ఇంతటి అద్భుతమైన విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు . అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ భవిష్యత్తులో తాము ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తామన్నారు.  రాష్ట్రస్థాయిలో  అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఎస్ ఆర్ కళాశాల జోనల్ ఇంచార్జ్ గోవర్ధన్ రెడ్డి ప్రిన్సిపుల్స్ అధ్యాపక బృందం సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



Comments

Popular posts from this blog

జర్నలిస్టులకు బువ్వకుండ...

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్...