Posts

జర్నలిస్టులకు బువ్వకుండ...

Image
 జర్నలిస్టులకు బువ్వకుండ... నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్15( తెలంగాణ మేఘటైమ్స్): నిజామాబాద్ ప్రెస్  క్లబ్ లో  జర్నలిస్టుల కోసం కెసిఆర్ బువ్వ కుండ  పథకాన్ని తెలంగాణ జాగృతి, ఎమ్మెల్సీ కవిత తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గడిచిన మూడు సంవత్సరాలుగా జిల్లా ఆసుపత్రి మరియు బోధన్ ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు.  అదేవిధంగా జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షల కొరకై ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఈ పథకాన్ని అమలు చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల నుండి నగరానికి వస్తున్న జర్నలిస్టులు   బిజీగా ఉంటూ మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు  వారికోసం తాజాగా జర్నలిస్టులకు బువ్వ కుండ పథకాన్ని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమకు అండగా ఉండడంతో పాటు ఆకలి తీర్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవిత కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ ప్రతినిధులు యూనియన్ల నాయకులు  జర్నలిస్టులు పాల్గొన్నారు.

రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్...

Image
రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకుల అరెస్ట్... నిజామాబాద్ ప్రతినిధి, సెప్టెంబర్13( తెలంగాణ మేఘ టైమ్స్ ): తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 13న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో  తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకోవడంతో అధ్యక్షులువిజయ్ పాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, ద్యావర  నర్సారెడ్డి లను తెల్లవారుజామున మూడు గంటలకి ఫోర్త్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సంయుక్తంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మూడు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అందుకోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అనగా 13వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కొరకు వెళ్తుంటే తెల్లవారుజామున మూడు గంటలకి ఇంటి వద్ద వచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ అరెస్టుల వల్ల రెడ్డి ఐక్యవేదిక ఉద్యమాలను ఆపలేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జరిగే అసెంబ్లీ లో

ఇంటర్ ఫలితాల్లో ఎస్.ఆర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Image
                          అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులతో అధ్యాపక బృందం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో ఎస్.ఆర్  విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ఇన్చార్జి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ  బైపీసీ విభాగంలో ఇంటర్ మొదటి సంవత్సరం లో సాయి అమృత వర్షిని 437/ 440 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. అదేవిధంగా  436/ 440 మార్కులు సాధించిన విద్యార్థులు ఆరుగురు , 435/440 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారని రాష్ట్ర జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించి విజయం  సాధించారని  అన్నారు.. ఎస్సార్ కళాశాలలు స్థాపించి నిజామాబాద్ లో 9 సంవత్సరాలు గడుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు మా యొక్క కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు అన్నారు. ఇవేకాకుండా జేఈఈ మెయిన్స్ లో కానీ, ఐఐటీలో కానీ, ఎంసెట్ లో కాని  ఇలాగే అద్భుత ఫలితాలను సాధిస్తుంది మా ఎస్ ఆర్ కళాశాల అని హర్షం వ్యక్తం చేశారు. మా కళాశాల అధ్యా

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

Image
  నిజామాబాదు,( తెలంగాణ మేఘ టైమ్స్ ) మే 23  : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71   ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  కాగా, ప్రజావాణి అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ వాటిని సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.  అనంతరం ప్రధానమంత్రి 15సూత్రాల పథకం అమలు, పల్లె ప్రగతి సన్నద్ధత, మన ఊరు-మన బడి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.